ద్వారక తిరుమలను సందర్శించిన ఏపీ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య
ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య ఆదివారం సందర్శించారు.
ద్వారక తిరుమలను సందర్శించిన ఏపీ హై కోర్టు న్యాయమూర్తి  జస్టిస్ ఎన్.జయసూర్య

అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)

ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య ఆదివారం సందర్శించారు.

ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభ ఘనస్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్న న్యాయమూర్తికి అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఏఈవో పి.నటరాజారావు స్వామివారి మెమెంటోను, ప్రసాదాలను అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande