తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు..... టీటీడీ
తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
Vijayawada temple

అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)

తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

‘బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు రోజుకు 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆ తర్వాత వచ్చే వాహనాలను చెక్ పాయింట్ల వద్ద నిలిపేస్తారని ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల సంఖ్యపై ఈ తరహా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు’ అని పేర్కొంది. టీటీడీ పేరుతో తప్పుడు వార్తలు, సమాచారాన్ని ప్రచారం చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande