బంగాళాఖాతంలో తిష్టవేసిన అల్పపీడనం.. ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
Rain


ఆంధ్రప్రదేశ్, 14 సెప్టెంబర్ (హి.స.)మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని..ఈ భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

వాతావరణ శాఖ ప్రకారం.. ఈ రోజు మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే వర్షాల సమయంలో 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని అంచనా వేశారు.

తెలంగాణలో వర్షాలు ఇలా

ఇక అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని మెదక్, సిద్దిపేట, మేడ్చల్-మల్కాజిగిరి, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని రాబోయే గంటల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. రాబోయే మూడు గంటల్లో యాదాద్రి-భువనగిరి, జనగాం, హన్మకొండ, కరీంనగర్ , పెద్దపల్లి , మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలకు కూడా వర్షాలు విస్తరించే అవకాశం ఉందని తెలింది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande