తిరుమల బ్రహ్మోత్సవాల వేళ అధికారుల నిఘా
తిరుపతిలో భక్తులు, యాత్రికులు, ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల వేళ మరింత అధికంగా ఉంటోంది.
Vijayawada temple


అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)

తిరుపతిలో భక్తులు, యాత్రికులు, ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల వేళ మరింత అధికంగా ఉంటోంది. నాసిరకం వస్తువులు అంటగట్టడం, ప్రతిదానిపై రూ.5 నుంచి రూ.10 అదనంగా దండుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది.

బస్టాండ్లోని ఓ దుకాణంలో రూ.20 నీటి బాటిల్కు ఏకంగా రూ.30 వసూలు చేశారు. లేదంటే ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు. వాళ్లడిగిన మొత్తం చెల్లించిన నగరపాలిక సిబ్బంది మెల్లగా వెళ్లిపోయారు. ఆవెంటనే నగరపాలిక, తూనికలు కొలతలు, ఆహార భద్రతాధికారులు దాడులు చేసి జరిమానాలు విధించారు. ఇలా వారెళ్లిన ఆరు దుకాణాల్లోనూ అధిక ధరలు వసూలు చేయడంతో ఆధారాలు చూపి తీవ్రంగా హెచ్చరించారు. బ్రహ్మోత్సవ వేళ భక్తులను దోచుకుంటే సహించేది లేదంటూ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande