సేవా సంకల్ప్ అభియాన్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు నాయుడు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని గురువారం వారణాసిలో నిర్వహించనున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.
AP CM


ఆంధ్రప్రదేశ్ , 16 సెప్టెంబర్ (హి.స.)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని గురువారం వారణాసిలో నిర్వహించనున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో సాగించిన ప్రస్థానాన్ని స్మరించుకునేందుకు దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా కాశీలో ‘వారణాసి–వడోదర సేవా యాత్ర’ నిర్వహిస్తున్నారు.

‘సేవా సంకల్ప్ అభియాన్’ ప్రధానమంత్రి మోదీ ప్రజాజీవితంతో ప్రత్యేక అనుబంధం ఉన్న వారణాసి, వడ్నగర్ ప్రాంతాలను అనుసంధానించనుంది.

దేశ అభివృద్ధి ప్రస్థానంలో ప్రజల భాగస్వామ్యం, సేవా స్ఫూర్తి, సామాజిక బాధ్యత ఎంతో కీలకమనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయనున్నారు.

ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం, ప్రతి యువత, ప్రతి మహిళ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములు కావాలనే స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

షెడ్యూల్ ప్రకారం, చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం 7:30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి ఉదయం 9:35 గంటలకు వారణాసి చేరుకుంటారు. ఉదయం 11:15 గంటలకు శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం రుద్రాక్ష ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు వెళ్లి సేవా యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3:10 గంటలకు వారణాసి నుంచి బయలుదేరి సాయంత్రం 5:15 గంటలకు అమరావతి చేరుకుంటారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande