తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం
రాష్ట్రంలో తీవ్రమవుతున్న 'ఎల్ నినో' వాతావరణ పరిస్థితులు, ఊహించని ఉష్ణోగ్రతలు మరియు రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్పై తెలంగాణ శాసనసభలో ప్రత్యేక చర్చ జరిగింది.
Electricity


తెలంగాణ , 16 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్రంలో తీవ్రమవుతున్న 'ఎల్ నినో' వాతావరణ పరిస్థితులు, ఊహించని ఉష్ణోగ్రతలు మరియు రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్పై తెలంగాణ శాసనసభలో ప్రత్యేక చర్చ జరిగింది. శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడూతూ — వాతావరణ మార్పుల వల్ల రాష్ట్రంలో ఒకే రోజు అత్యధికంగా 19,000 మెగావాట్ల (MW) విద్యుత్ వినియోగం నమోదైందని, ఇది రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త రికార్డని తెలిపారు.వ్యవసాయం మరియు తాగునీటి సరఫరాపై దృష్టి:ఎల్ నినో తీవ్రత వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడం, సాగునీరు మరియు తాగునీటికి డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో విద్యుత్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతోందని ప్రభుత్వం పేర్కొంది. అయితే, రికార్డు స్థాయిలో డిమాండ్ ఉన్నప్పటికీ ఎక్కడా రైతులకు, గృహ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా 24 గంటల విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా అందిస్తున్నామని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది.ముందస్తు ప్రణాళికలు:రాబోయే కాలంలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు, వ్యవసాయ రంగంలో పంటలను కాపాడేందుకు జలాశయాల నుంచి నీటి విడుదల క్రమబద్ధీకరణ మరియు విద్యుత్ కొనుగోలుపై ముందస్తు వ్యూహాలను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాతావరణ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande