
ఆంధ్రప్రదేశ్ , 16 సెప్టెంబర్ (హి.స.)కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ (PMAY-G)’ పథకం కింద రెండు తెలుగు రాష్ట్రాలకు అదనంగా నిధులు మరియు గృహాలను కేటాయిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు కలిపి ప్రాధాన్యత ప్రాతిపదికన ఏకంగా 5 లక్షల గృహాలను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అధికారికంగా ప్రకటించారు.
రాష్ట్రాల వారీగా కేటాయింపులు:
ఈ నూతన కేటాయింపులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనంగా 2.25 లక్షల గృహాలు లభించాయి. దీంతో ఏపీలో పీఎంఏవై-జీ కింద లబ్ధిదారులకు నిర్మించే ఇళ్ల సంఖ్య భారీగా పెరిగింది. తెలంగాణ రకానికి కూడా మిగిలిన వాటా దక్కింది. గ్రామీణ ప్రాంతాల్లో పక్కా ఇళ్లు లేని పేద ప్రజలకు పక్కా గృహ వసతి కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్