బొల్లారం ఆయుధాల చోరీ కేసు..... నిందితుడికి అస్వస్థత
బొల్లారంలోని ఆర్మీ మద్రాస్ రెజిమెంట్ లో ఆయుధాల చోరీ కేసులో నిందితుడైన మాజీ హవిల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ అలియాస్ రాజు(37) అస్వస్థతకు గురయ్యాడు.
Bollaram


తెలంగాణ , 16 సెప్టెంబర్ (హి.స.)బొల్లారంలోని ఆర్మీ మద్రాస్ రెజిమెంట్ లో ఆయుధాల చోరీ కేసులో నిందితుడైన మాజీ హవిల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ అలియాస్ రాజు(37) అస్వస్థతకు గురయ్యాడు. గత నెల 30వ తేదీ రాత్రి ఈ దొంగతనానికి పాల్పడిన మల్లేశ్ ను పోలీసులు ఈ నెల 11న అరెస్టు చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం 12వ తేదీన నిందితుణ్ని చంచల్గూడ జైలుకు తరలించారు.

మల్లేశ్ కు నిర్వహించిన రక్త పరీక్షల్లో క్రియాటినిన్, బిలిరుబిన్ స్థాయిలు అసాధారణ స్థాయిలో ఉన్నట్లు తేలిందని సమాచారం. దీంతో పాటు కాళ్లలో వాపు రావడంతో చికిత్స నిమిత్తం సోమవారం అతణ్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం మల్లేశ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, ఒకటి రెండు రోజుల్లో అతణ్ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande