ముగిసిన విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశం
విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. మొత్తం 25 అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
Vijayawada temple


అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.)

విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. మొత్తం 25 అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశం అనంతరం పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. దసరా సందర్భంగా గతంలో చర్చ జరిగిన అంశాలపై ఈరోజు కూడా చర్చించినట్లు తెలిపారు.

గతంలో కంటే ఈసారి మరింత ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అమ్మవారి ఆలయం తరఫున కాణిపాకం వినాయకుడికి పట్టువస్త్రాలు సమర్పించినట్లు తెలిపారు. దసరా ఉత్సవాలకు సంబంధించిన పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లకు గత అనుభవం ఉందా? లేదా? అనేది పరిశీలించిన తర్వాతే కాంట్రాక్ట్ ఇస్తామన్నారు.

గత దసరాకి పాలకమండలి లేదని.. కానీ ఈసారి దసరా ఏర్పాట్ల పరిశీలన కోసం పాలకమండలి సభ్యులను నియమించనున్నట్లు బొర్రా గాంధీ తెలిపారు. విద్యుత్, క్యూ లైన్లు, పెయింటింగ్ ప్రతిదీ పరిశీలిస్తామన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీఠ వేస్తామన్నారు. ఈసారి పోలీసులు తక్కువగా ఉండే విధంగా చూస్తామని తెలిపారు. ఈఏడాది ఆర్జిత సేవలను కొత్తగా నిర్మాణం చేసుకున్న భవనంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande