
తెలంగాణ , 16 సెప్టెంబర్ (హి.స.)నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటనలో గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో బస్సు టెర్మినల్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆయన వెల్లడించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రయాణీకులు వేచి ఉండేలా వెయిటింగ్ హాళ్లు, వాహనాలకు పార్కింగ్ సదుపాయాలు సహా ఆధునిక వసతులతో ఈ టెర్మినల్స్ను రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు. నగరాన్ని సుస్థిర ప్రజా రవాణా కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
గాజులరామారంలో టెర్మినల్ ను ఏర్పాటు కోసం సుమారు 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో 150 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు తగిన అంశాలను పరిశీస్తోంది. మరియు ఎల్బీనగర్, ఘట్కేసర్ : ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లోనూ ప్రభుత్వం బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్