
ఆంధ్రప్రదేశ్ , 16 సెప్టెంబర్ (హి.స.)నగరంలోని సెంట్రల్ పార్క్ వద్ద పెద్ద మొత్తంలో చినిగిపోయిన కరెన్సీ నోట్లు కుప్పగా పడి ఉండటాన్ని వాకర్స్ గుర్తించారు. ₹500, ₹100, ₹50, ₹20, ₹10 నోట్లతో పాటు కొన్ని పత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే చోట ఇంత మొత్తంలో చినిగిన నోట్లు ఎవరు పడేశారు. అక్కడ ప్రజలు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు కరెన్సీ నోట్లను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్