కామారెడ్డి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతుల ఆందోళన
విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యుత్ సబ్స్టేషన్ ను ముట్టడించారు
Farmers


కామారెడ్డి, 16 సెప్టెంబర్ (హి.స.)

విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యుత్ సబ్స్టేషన్ ను ముట్టడించిన సంఘటన బుధవారం కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలోని విద్యుత్ సబస్టేషన్ను నేడు బిఆర్ఎస్ పార్టీ రైతులు ముట్టడించారు. సుమారు గంట పాటు అక్కడ నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయానికి నిరంతరంగా 18 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.రైతులు సాగు చేసిన పంటలకు అవసరమైన సమయంలో విద్యుత్ అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande