'భారత్ ఫ్యూచర్ సిటీ'లో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలి......మంత్రి శ్రీధర్ బాబు
'భారత్ ఫ్యూచర్ సిటీ'లో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు...
Minister


హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)

'భారత్ ఫ్యూచర్ సిటీ'లో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు.

బుధవారం రాష్ట్ర సచివాలయంలో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎనర్జీ అండ్ ట్రేడ్ శాశ్వత కార్యదర్శి ఆగస్టిన్ లీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం శ్రీధర్ బాబుతో సమావేశమైంది. ఈ సందర్భంగా సెమీకండక్టర్ రంగంలో సింగపూర్కు ఉన్న సాంకేతిక, పారిశ్రామిక అనుభవాన్ని తెలంగాణతో అనుసంధానించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ఫ్యాబ్ పరిశ్రమలతో పాటు అనుబంధ పరిశ్రమలు, సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేలా సింగపూర్ కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచేందుకు చొరవ చూపాలని వారు కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande