కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి.. మహేష్ కుమార్ గౌడ్
ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కాపాడుకుంటామని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.
Tpcc


హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.) ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కాపాడుకుంటామని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న మహేష్కుమార్ గౌడ్ను బుధవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచే కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని మహేష్కుమార్ గౌడ్ సూచించారు. నియోజకవర్గంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలని కోరారు. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఈ సందర్భంగా చర్చించారు.

ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande