కల్వర్టును కారు ఢీ..... నలుగురు మృతి
శంషాబాద్లో ఘోర రోడ్డుప్రమాదం చోచుచేసుకుంది. కల్వర్టును కారు ఢీకొనగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
Accident


హైదరాబాద్ , 19 సెప్టెంబర్ (హి.స.)శంషాబాద్లో ఘోర రోడ్డుప్రమాదం చోచుచేసుకుంది. కల్వర్టును కారు ఢీకొనగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును కారు బలంగా ఢీకొంది. ఈ రోడ్డుప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వీరందరినీ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా మహబూబ్నగర్లోని నవాబుపేట మండలం చౌడూరు గ్రామ వాసులుగా గుర్తించారు. మృతులు కేతావత్ లింబ్య, జమున, కేతావత్ మానసింగ్, కేతావత్ వాస్రామ్ గా గుర్తించారు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలు ఉస్మానియాకు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande