తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హర్యానా మంత్రి అరవింద్ శర్మ!
తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హర్యానా మంత్రి అరవింద్ శర్మ!
్


తిరుచానూరు , 19 సెప్టెంబర్ (హి.స.) హర్యానా రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి అరవింద్ కుమార్ శర్మ కుటుంబ సమేతంగా ఈ రోజు శనివారం ఉదయం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయ వద్దకు చేరుకున్న రవింద్ కుమార్ శర్మకు సూపరింటెండెంట్ రమేష్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

హర్యానా రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి అరవింద్ కుమార్ శర్మ ముందుగా ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం అమ్మవారి మూల మూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ వేద ఆశీర్వచన మండపంలో అర్చకులు శర్మ కు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande