రామోజీ ఫిల్మ్సిటీలో ఎన్ ఎస్ జీ, ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్
ఎన్ ఎస్ జీ, ఆక్టోపస్ దళాలు రామోజీ ఫిల్మ్సిటీలో మాక్ డ్రిల్ నిర్వహించాయి.
Ramoji film city


హైదరాబాద్ , 19 సెప్టెంబర్ (హి.స.)ఎన్ ఎస్ జీ, ఆక్టోపస్ దళాలు రామోజీ ఫిల్మ్సిటీలో

మాక్ డ్రిల్ నిర్వహించాయి. నిత్యం సందర్శకులతో సందడిగా ఉండే ఇలాంటి చోట ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే స్పందన ఎలా ఉండాలనే అంశంపై ఎన్ ఎస్ జీ, ఆక్టోపస్ దళాలు మాక్డ్రిల్ నిర్వహించాయి. ఈ మాక్డ్రిల్లో ఎన్ ఎస్ జీ కమాండోలు, ఆక్టోపస్ బలగాలు ప్రధానంగా 3 అంశాలను ప్రదర్శించాయి. భవనంలోకి చొరబడి ఆపరేషన్ నిర్వహించడం, ర్యాప్లింగ్తో భవనం పైనుంచి కిందకు దిగడం, ఉగ్రవాద ముప్పును నిర్వీర్యం చేయడం వంటి విన్యాసాలు చేశారు. చీకటిలోనూ అత్యాధునిక పరికరాలతో భవనంలోకి ప్రవేశించిన కమాండోలు మెట్ల మార్గంలో అంతస్తులను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ ముందుకు సాగారు. భవనం పైకప్పు నుంచి తాళ్ల సాయంతో కిందికి దిగుతూ ర్యాప్లింగ్ చేశారు. వాల్ వాక్ స్పైడర్ మ్యాన్ టెక్నిక్లతో భవనాన్ని వివిధ మార్గాల్లో అప్రోచ్ చేశారు.

అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో అవగాహన కల్పించడమే ఈ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని ఎన్ ఎస్ జీ, ఆక్టోపస్ దళాలు తెలిపాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande