
అమరావతి , 19 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్రంలో నేటి నుంచి ఉమెన్ ఏపీఎల్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఫ్రాంచైజీ విధానంలో రాష్ట్రంలో తొలిసారిగా మహిళా టీ20 పోటీలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి స్టేడియంలో డే అండ్ నైట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఏపీఎల్ పోటీల్లో అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్ స్టార్స్ పాల్గొంటున్నాయి. మ.1.30 గంటలకు రాయలసీమ జెన్స్టార్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ టీమ్ లు తలపడనున్నాయి. సాయంత్రం 6 గంటలకు అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్