
తిరుచానూరు, 19 సెప్టెంబర్ (హి.స.)తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సురేష్ రెడ్డి ఈ రోజు శనివారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఆలయ డిప్యూటీ ఈవో హరీందర్నాథ్ తదితరులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వదించి అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV