నేడు ధరల్లో ఊహించని ఛేంజ్.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం కూడా స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి.
gold


ముంబై, 19 సెప్టెంబర్ (హి.స.) కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం కూడా స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఈ రోజు శనివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,430గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,41,560గా ఉంది.

మరోవైపు వెండి ధరలు కూడా స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,50,100గా ఉంది.

-హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,430గా పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,560 వద్ద ట్రేడవుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,430కి లభిస్తుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,560 వద్ద కొనసాగుతోంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,430 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,560 వద్ద ట్రేడవుతున్నాయి.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,580 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,710 వద్ద ట్రేడవుతున్నాయి.

వెండి ధరలు చూస్తే..

-ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,50,100 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది.

-హైదరాబాద్లో కిలో సిల్వర్ ధర రూ.2,55,100 వద్ద ట్రేడవుతోంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande