శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు.....తిరుమలలో కొనసాగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.
తిరుమల


తిరుమల, 19 సెప్టెంబర్ (హి.స.) తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం మోహినీ అవతారంలో వలయప్పస్వామి దర్శనం ఇచ్చారు. ఇక, రాత్రి గరుడవాహనంపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో గరుడ వాహనసేవకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో మాడ వీధులు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. నాలుగు మాడ వీధుల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం నుండి తిరుమలకు టూవీలర్స్ నిలిపివేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డులో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. గ్యాలరీల్లో 1.80 లక్షల మంది భక్తులను అనుమతించనున్నారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి.కృష్ణతేజ, శిలాతోరణం, బాటగంగమ్మ సర్కిల్ మీదుగా ఆక్టోపస్ భవనం వరకు క్యూలైన్ వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande