
సత్యసాయి జిల్లా , 20 సెప్టెంబర్ (హి.స.)
వినాయక నిమజ్జనం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వినాయకుడి విగ్రహంపై హెలికాప్టర్తో పూల వర్షం కురిపించారు. గరిడి గణపతి 50 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన హెలికాప్టర్తో పూలవర్షం కురిపించారు. పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి నుంచి ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాదిమంది తరలివచ్చారు. ఏడు రోజులుగా పట్టణంలో వినాయక ప్రతిమలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి వినాయక విగ్రహాల శోభాయాత్ర మొదలైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ