ప్రమాదంలో కారు దగ్ధం.. డాక్టర్ సజీవ దహనం..
సూర్యాపేట జిల్లా పరిధిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం- సూర్యాపేట 365బీ జాతీయ రహదారిపై పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో ఓ వోల్వో కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది.
AccidentAccident


సూర్యాపేట, 20 సెప్టెంబర్ (హి.స.)

సూర్యాపేట జిల్లా పరిధిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం- సూర్యాపేట 365బీ జాతీయ రహదారిపై పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో ఓ వోల్వో కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది.

దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఖమ్మం మమత ఆసుపత్రికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైనట్లు పోలీసులు గుర్తించారు.

ఈ విషాద ఘటన వైద్య రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సూర్యాపేట మండలం పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో ఆదివారం ఉదయం సుమారు 7.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు.

ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వోల్వో కారు అదుపుతప్పి రహదారి మధ్యలోని డివైడర్ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఢీకొన్న వెంటనే కారులో మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది. కారులో ఉన్న వ్యక్తి బయటకు వచ్చే అవకాశం లేక మంటల్లో చిక్కుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande