వెంకన్నపేట గ్రామంలో చోరీ
రంగంపేట మండలం వెంకన్నపేట గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గ్రామంలోని ఓ ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు.
theft


అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.)

రంగంపేట మండలం వెంకన్నపేట గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గ్రామంలోని ఓ ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగంపేట మండలం వెంకన్నపేట గ్రామానికి చెందిన గురజరపు వెంకటేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 12వ తేదీన ఇంటికి తాళం వేసి విశాఖపట్నం వెళ్లారు. ఈ నెల 19వ తేదీ సాయంత్రం వెంకటేశ్వరరావు మేనల్లుడు మెడిశెట్టి కృష్ణ ప్రసాద్, తన భార్యతో కలిసి రాజమహేంద్రవరం నుంచి వెంకన్నపేటకు వచ్చారు. ఇంటి ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఇనుప బీరువాలో భద్రపరిచిన 4 గ్రాముల బంగారు ఉంగరాలు, 2 గ్రాముల బంగారు నాణేలు, 4½ కిలోల వెండి వస్తువులు చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande