కేసీఆర్ కుటుంబం రాష్ట్ర ప్రజలకు ఏం చేసింది? ఎంపీ చామల కిరణ్ కుమార్
కేసీఆర్ కుటుంబం రాష్ట్ర ప్రజలకు ఏం చేసింది? అని కాంగ్రెస్ మీడియా కన్వీనర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
Mp


హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)

కేసీఆర్ కుటుంబం రాష్ట్ర ప్రజలకు ఏం చేసింది? అని కాంగ్రెస్ మీడియా కన్వీనర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

ఆదివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో గల అజీజ్ నగర్ లో కాంగ్రెస్ బృందం మల్లు రవి, ఎంపి అనిల్ యాదవ్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, నవీన్ యాదవ్, టిపీసీసీ స్పోక్ పర్సన్ గౌరి సతీష్, టీపీసీసీ సభ్యులు షాబాద్ దర్శన్ తదితర కాంగ్రెస్ బృందంతో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావుకు, పైలట్ రోహిత్ రెడ్డి లకు సంబంధించిన ఫామ్ హౌస్ భూములను పరిశీలించడం జరిగింది.

అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..తెలంగాణకు రూ.8 లక్షల కోట్ల అప్పులు.. మీకు మాత్రం వందల, వేల ఎకరాల ఆస్తులా? అప్పులు రాష్ట్రానికి.. ఆస్తులు మీకెలా వచ్చాయి? ఉద్యమ సమయంలో సామాన్యులుగా ఉన్న వారు ఇప్పుడు వందల ఎకరాల భూములకు యజమానులు ఎలా అయ్యారని, ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే తమ పర్యటన అని చామల అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande