ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం.. ఆర్మూర్ ఏసిపి
ప్రజల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి సూచించారు.
Police


నిజామాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)

ప్రజల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి సూచించారు.

మన ఊరు-మన భద్రత-మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆలూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు, దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయని తెలిపారు.

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, దుకాణాలు, వ్యాపార సంస్థలు, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీసులకు సహకరించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande