
మంచిర్యాల, 20 సెప్టెంబర్ (హి.స.)
బొగ్గు పెన్షన్దారులకు చెందిన కోట్లాది రూపాయల అవినీతి కుంభకోణానికి పాల్పడిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్ఎ) సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ (సీఎస్పీ) ధన్బాద్ ప్రధాన కార్యాలయంలో రూ.3.64 కోట్ల విలువైన పెన్షన్ కుంభకోణం జరిగిందన్నారు.
సీఎంపీఎఫ్ఎకు చెందిన నలుగురు అధికారులు నకిలీ పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి, పదవీ విరమణ చేసిన, మరణించిన 142 మంది బొగ్గు కార్మికుల పెన్షన్ను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..