ఉప ఎన్నికను ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్కు లేదు.. బండి సంజయ్
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు.
Bandi Sanjay


కరీంనగర్, 20 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో బండి సంజయ్ మాట్లాడుతూ..

పూర్తిగా వన్ సైడ్ అసెంబ్లీ జరుపుకున్నారని, మమ అనిపించారని వారు వ్యాఖ్యానించారు.

ఆరు గ్యారెంటీలపై అసెంబ్లీలో అసలు చర్చ జరగలేదని అన్నారు. ఆరు గ్యారెంటీల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడటంలేదని, అభివృద్ధి గురించి ఇచ్చిన హామీల గురించి మాట్లాడటంలేదన్నారు.

కానీ ఇప్పుడు ఫామ్ హౌజ్ ల పర్యటనలకు వెళుతున్నారని చెప్పారు. కేసీఆర్ కుటుంబ ఫామ్ హౌస్ లను

పర్యాటక కేంద్రాలుగా మారుస్తున్నారా అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

ప్రజల ఆలోచనల గురించి చర్చ జరిగినప్పుడు, ఇచ్చిన హామీల అమలు గురించి మాట్లాడినప్పుడు సమావేశాలు జరిగినట్టు అని చెప్పారు. కానీ అసెంబ్లీ సమావేశాలు అలా జరలేదని చెప్పారు.

ఫామ్ హౌస్ లను ఏమైనా పర్యాటక కేంద్రాలుగా మారుస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తుల ఫామ్ హౌస్ లకు వెళ్లే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డే అసెంబ్లీలో తమ వద్ద కబ్జాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని చెప్పారని, ఆధారాలు ఉంటే భూములను వెనక్కి తీసుకోవాలన్నారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్ కు లేదని చెప్పారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించిందని, ఉప ఎన్నికలొస్తే కాంగ్రెస్ను రాజకీయ నిమజ్జనం చేయడం తథ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తమకు పోటీ కానేకాదని, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande