
ఆంధ్రప్రదేశ్, 20 సెప్టెంబర్ (హి.స.)బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి, సోమవారం తూర్పుమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా, మంగళవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. బుధవారం ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోని పశ్చిమమధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వివరించారు
ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడనుంది.
సోమవారం: తూర్పుమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది.
మంగళవారం: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.
బుధవారం ఉదయానికి: ఇది దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీర సమీపంలో ఉన్న పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాత ప్రాంతానికి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇలా: ఈ ద్రోణుల ప్రభావంతో ఆదివారం (సెప్టెంబర్ 20) రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమై, విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం నుంచి రాబోయే నాలుగు రోజుల పాటు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు పడటంతో పాటు తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV