సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో చోరీ
సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో చోరీ
theft


హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)

హైదరాబాద్‌లోని సనత్ నగర్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆసుపత్రి కాంపౌండ్‌లో దొంగలు పడ్డారు. నిర్మాణంలో ఉన్న ఈ దవాఖాన ప్రాంగణం నుంచి భారీగా విద్యుత్ కేబుళ్లు, విలువైన కాపర్ వైర్లు మరియు ఇనుప సామాగ్రి మాయమైనట్లు గుర్తించారు. రాత్రి వేళ భద్రతా సిబ్బంది కన్నుకప్పి గుర్తుతెలియని వ్యక్తులు ఈ చోరీకి పాల్పడ్డారు.

ఉదయాన్నే పనుల వద్దకు వచ్చిన సిబ్బంది సామాగ్రి కనిపించకపోవడంతో వెంటనే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సనత్ నగర్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రధాన ద్వారాలు, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తూ దొంగల జాడ కోసం గాలిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వైద్యశాలలోనే దొంగతనం జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande