అనకాపల్లి జిల్లాలో సగటున 122.8మిల్లీమీటర్ల వర్షపాతం.నమోదు
అనకాపల్లి జిల్లాలో సగటున 122.8మిల్లీమీటర్ల వర్షపాతం.నమోదు
rain


అనకాపల్లి పట్టణం :,24 సెప్టెంబర్ (హి.స.)

గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు అనకాపల్లి జిల్లాలో సగటున 122.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లాలో అత్యధికంగా సబ్బవరం మండలం 193.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పరవాడ మండలంలో 164.3, కె.కోటపాడు మండలంలో 155.0, మాడుగుల మండలంలో 156.7, అనకాపల్లి మండలంలో 140.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande