
హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.)
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలు బుధవారంతో ముగియడంతో నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి మండపం షెడ్డు తొలగించే పనులు చేపట్టిన నిర్వహాకులు ఇవాళ అర్ధరాత్రి విగ్రహాన్ని ట్రాలీ ఎక్కిస్తారు.
శుక్రవారం ఉదయం 5 గంటలకు వెల్డింగ్ పనులు పూర్తికానుండగా పూజ అనంతరం 6 గంటలకు శాభాయాత్ర ప్రారంభం కానుంది.
మధ్యాహ్నం 1:30 గంటల నుంచి నిమజ్జం పూర్తి అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు