
హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.)
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కుకున్న డీఎస్పీ భీమ్ రెడ్డి కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. భీమ్ రెడ్డికి సంబందించి 8 మంది బినామీలను గుర్తించిన ఏసీబీ అధికారులు వారిపై ఫోకస్ పెట్టారు.
ఈ క్రమంలో పుప్పాల గూడలోని బీమ్ బెడ్డి బినామీ కోమటి వెంకటేశ్ ఇంట్లో గురువారం సోదాలు నిర్వహించారు. పుప్పాలగూడతో సహా మొత్తం 8 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు రెయిడ్స్ నిర్వహించారు.
ఏసీబీ డీఎస్పీ జి. శ్రీధర్ నేతృత్వంలో బినామీల ఆస్తులు, డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాల్లో లభించే పత్రాలు, ఆధారాలపై ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సోదాల్లో ఓ బినామీ ఇంట్లో కట్టల నగదు బయటపడటం కలకలం రేపుతోంది. ఇండియన్ కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీ కూడా పట్టుబడినట్లు తెలుస్తోంది.కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో భీమ్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. భీమ్ రెడ్డి రూ.200 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..