అధికారులు హై అలర్ట్ ఉండాలి .. హనుమకొండ జిల్లా కలెక్టర్
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు.
Collector


హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.)

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు.

గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి, జిల్లాలో వర్ష ప్రభావం, ప్రస్తుత పరిస్థితులు, వర్షాలకు హై అలెర్ట్ ఉన్న నేపథ్యంలో అధికారులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.

మండలాల వారీగా వర్షపాతం, చెరువుల పరిస్థితి, వాగులు, వంకలు, రహదారుల పరిస్థితి తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గతంలో వర్షాల సమయంలో సమస్యలు ఎదురైనా ప్రాంతాల వివరాలను తెలుసుకుని, ఆయా ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టడంపై అధికారులకు కలెక్టర్ పలు ఆదేశాలను జారీ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande