రైతులకు విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తిని పెంచలేదని జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
Mla


భూపాలపల్లి, 24 సెప్టెంబర్ (హి.స.)

కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తిని పెంచలేదని జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం థర్మల్ పవర్ స్టేషన్ల పరిస్థితులను పరిశీలించడంలో భాగంగా జయశం కర్ భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన ఎమ్మెల్యే, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, శంకర్ నాయక్, ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర బృందాన్ని కేటీపీపీ లోపలికి వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు.

దీంతో ప్రభుత్వ విధానాలను, పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేటీపీపీ ఎదుట ధర్నా నిర్వహిం చారు. అనంతరం సొంత పూచీకత్తుపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను ప్లాంట్లోకి పోలీసులు అనుమతించారు.

అనంతరం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు సాగునీరు, నిరంతర విద్యుత్ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, గోదావరిలో సమృద్ధిగా నీరు ఉన్నా.. కరెంటు లేక మోటార్లు నడవక రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande