ఖైరతాబాద్ అనర్హత కేసులో ప్రజలకు వాస్తవాలు చెప్పాలి.. బండి సంజయ్
ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బండి సంజయ్


హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.)

ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్కు లేదని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సిగ్గుతో తలదించుకోవాలన్నారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో బండి సంజయ్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుతో చెంప దెబ్బ కొట్టినా మీకు సిగ్గు రాదా? ఇప్పటికి కూడా ఎవరికి వారే తమ విజయంగా భావిస్తారా? మీ అవకాశవాద, అధికార రాజకీయాల కోసం ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా? అని నిలదీశారు.

ఈ తీర్పును కొన్ని మీడియా సంస్థలు వక్రీకరిస్తున్నాయన్నారు. ఖైరతాబాద్ అనర్హత కేసులో వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఇంకో పార్టీపై పోటీ చేయడాన్ని ఏమనాలి? అనైతిక, ఫిరాయింపుల వ్యవహారాలకు పాల్పడ వారికి ఇదే గతి వర్తిస్తుందనే సంకేతాలను పంపిద్దామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande