
పరిగి, 24 సెప్టెంబర్ (హి.స.) ఆనాథ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడుతున్న కీచక టీచర్పై పోక్సో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే..... రంగారెడ్డి పరిగి మున్సిపల్ పరిధిలోని ఓ పాఠశాలలో శ్రీశైలం అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.
అదే పాఠశాలలో రెండు నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న చిన్నారులు, సదరు టీచర్ వికృత చేష్టలకు భయాందోళనకు గురై ఆశ్రమం సంరక్షకురాలికి విషయం తెలపగా, ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మోహనకృష్ణ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్