యమునా ఎక్స్ప్రెస్వేపై ఘోర విషాదం: స్లీపర్ బస్సుకు అంటుకున్న మంటలు.. 9 మంది దుర్మరణం
యమునా ఎక్స్ప్రెస్వేపై ఘోర విషాదం: స్లీపర్ బస్సుకు అంటుకున్న మంటలు.. 9 మంది దుర్మరణం
accident


నోయిడా, 24 సెప్టెంబర్ (హి.స.)

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలో ఉన్న యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం అర్ధరాత్రి దాటాక ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు పెను విషాదాన్ని నింపాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.

ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మహోబా వైపు వెళ్తున్న ఈ డబుల్ డెక్కర్ ఏసీ స్లీపర్ బస్సులో మొత్తం 30 నుంచి 35 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. రాత్రి సుమారు 11:30 గంటల ప్రాంతంలో జేవార్ సమీపంలో బస్సు వెళ్తున్న సమయంలో క్యాబిన్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

ప్రమాద క్షణాలను గుర్తుచేసుకున్న ప్రయాణికులు:

బస్సులో మంటలు చెలరేగే సమయానికి ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో పాటు క్షణాల వ్యవధిలో మంటలు నలువైపులా వ్యాపించడంతో బస్సులో తీవ్ర గందరగోళం నెలకొంది. ఊపిరి ఆడక ప్రయాణికులు భయాందోళనతో కేకలు వేయడం ప్రారంభించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కొంతమంది కిందకు దూకి ప్రాణాలను కాపాడుకోగా, దట్టమైన పొగ మరియు మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరికొందరు లోపల నుంచి బయటకు రాలేక సజీవదహనమయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలనుార్పుతూ సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను వెంటనే జేవార్‌లోని కైలాష్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రభుత్వం దిగ్భ్రాంతి:

ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోлపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానిక అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదానికి అసలు కారణాలు తెలియరాలేదని, షార్ట్ సర్క్యూట్ లేదా సాంకేతిక లోపం దీనికి మూలమై ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande