
హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.) నగరంలోని బాలాపూర్లో గణేశుడి లడ్డూ వేలం పూర్తయింది. ఈసారి లడ్డూ రికార్డు ధర పలికింది. వనస్థలిపురంలోని సాహెబ్నగర్కు చెందిన సామ ప్రణీత్రెడ్డి సొంతమైంది.
రూ.39లక్షలకు ఆయన దీన్ని సొంతం చేసుకున్నారు. వేలంలో పాల్గొనేందుకు 8 మంది తమ పేర్లను నమోదు చేసుకోగా.. చివరికి ప్రణీత్రెడ్డిని లడ్డూ వరించింది. గతేడాది రూ.35 లక్షలు పలికింది.
బాలాపూర్ ఉత్సవ సమితి మొట్టమొదటిసారిగా 1994లో లడ్డూ వేలం నిర్వహించింది. మొదటిసారిగా లడ్డూ ప్రసాదాన్ని రూ.450కు కైవసం చేసుకున్న రైతు కొలను మోహన్రెడ్డి.. దాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు పంచి.. మిగతాది పొలాల్లో చల్లారు. భగవంతుడు సుఖసంతోషాలను అందించారనే నమ్మకంతో మరుసటి ఏడాదితో పాటు 1998, 2004, 2008లలోనూ ఆయన పోటీ పడి దక్కించుకున్నారు. లడ్డూ వేలంలో పాల్గొనేందుకు 15 ఏళ్ల పాటు స్థానికులకే అవకాశం కల్పించిన ఉత్సవ సమితి.. ఆ తర్వాత బయట వ్యక్తులనూ అనుమతించింది. అలా 2009లో సరిత అనే మహిళ రూ.5.10 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు 31 సార్లు వేలం వేయగా.. 2020లో కరోనా నేపథ్యంలో వేలం వేయకుండా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు అందజేశారు. 2024లో కొలను శంకర్రెడ్డి రూ.30.01లక్షలకు, గతేడాది లింగాల దశరథ్గౌడ్ రూ.35 లక్షలకు దక్కించుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్