
అమరావతి, 25 సెప్టెంబర్ (హి.స.)
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఈరోజు హోం మంత్రి వంగలపూడి అనిత అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు రూ.29,17,219 విలువైన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ.. అనారోగ్యం, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ