
విశాఖ, 25 సెప్టెంబర్ (హి.స.)
విశాఖ పోలీసులు ఆగస్టు-2026 నెలలో రూ.1,13,87,040 విలువైన ఆస్తులను క్రైమ్ రికవరీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి చేతుల మీదగా బాధితులకు పోగొట్టుకున్న సొత్తును అందజేశారు.
ఆస్తి నేరాలకు సంబంధించి ఆగస్టు నెలలో 74 కేసులను పోలీసులు ఛేదించగా.. 102 మంది నిందితులను అరెస్ట్ చేశారు. రికవరీ చేసిన ఆస్తులలో 796 గ్రాముల బంగారం, 9.5 కేజీల వెండి, రూ.14.75 లక్షల నగదు ఉన్నాయి. దొంగిలించబడిన రూ.60.75 లక్షల విలువైన 414 మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు రికవరీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ