ఏపీలో డేటా సెంటర్లకు కొత్త నిబంధనలు.. 70 శాతం పునరుత్పాదక విద్యుత్ లక్ష్యం
డేటా సెంటర్లు వినియోగించే విద్యుత్లో 70 శాతం పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి పొందేలా నిబంధనను నిర్దేశించింది
Electricity


అమరావతి , 25 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు వినియోగించే విద్యుత్లో 70 శాతం పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి పొందేలా నిబంధనను నిర్దేశించింది. ముఖ్యంగా విశాఖపట్నాన్ని పెద్ద డేటా సెంటర్ హబ్గా అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర లక్ష్యానికి ఈ విధానం అనుసంధానమవుతోంది.

డేటా సెంటర్లు సాధారణ పరిశ్రమలతో పోలిస్తే భారీ స్థాయిలో విద్యుత్ వినియోగిస్తాయి. అంతేకాకుండా వాటికి నిరంతర విద్యుత్ సరఫరా, తగినంత నీటి లభ్యత, వేడి నియంత్రణ వంటి మౌలిక సదుపాయాలు అవసరం. అందువల్ల పెద్ద డేటా సెంటర్ల పెట్టుబడులను ఆకర్షించే సమయంలో పర్యావరణ పరిరక్షణ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

70 శాతం పునరుత్పాదక విద్యుత్ లక్ష్యం అమలు చేస్తే డేటా సెంటర్ రంగం విస్తరణతో పాటు సౌర, పవన విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీ రంగాలకు కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ లక్ష్యాన్ని అమలు చేయడానికి డేటా సెంటర్లకు విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థలు, గ్రిడ్ సామర్థ్యం, గ్రీన్ పవర్ కొనుగోలు విధానాలు, నిరంతర విద్యుత్ అవసరాలను సమన్వయం చేయాల్సి ఉంటుంది.

విశాఖపట్నాన్ని ఐటీ, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, ఫిన్టెక్ వంటి రంగాలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న పెట్టుబడి వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కు ముందు విశాఖలో ప్రత్యేక రంగాలపై ప్రాంతీయ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

డేటా సెంటర్ రంగంలో భారీ పెట్టుబడులు వస్తే ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు నిర్మాణం, విద్యుత్, రియల్ ఎస్టేట్, నెట్వర్కింగ్, భద్రత, నిర్వహణ, క్లౌడ్ సేవలు వంటి అనుబంధ రంగాల్లో కూడా అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande