గణేష్ నిమజ్జన సేవలకై రంగంలోకి హైడ్రా
నగరవ్యాప్తంగా వైభవంగా జరిగిన వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిసినవి.
Hydra


హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)నగరవ్యాప్తంగా వైభవంగా జరిగిన వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిసినవి. భక్తిశ్రద్ధలతో పూజలనంతరం గణనాథుడి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది.

ఇప్పటికే కొన్ని విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేయగా మిగతా విగ్రహాలు కూడా నిమజ్జనానికై బయలుదేరుతున్నాయి. భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది.

కూకట్ పల్లి ఐడీఎల్ చెరువు అభివృద్ధి పనులు పూర్తవ్వనప్పటికీ.. గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఏకంగా 25 అడుగుల మేర చెరువును తవ్వి నిమజ్జనాలు సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేసింది హైడ్రా. హుస్సేన్సాగర్తో పాటు నిమజ్జనం పెద్ద సంఖ్యలో జరిగే చెరువులలో హైడ్రా స్విమ్మర్లను రంగంలోకి దించింది. హుస్సేన్సాగర్లో మూడు షిఫ్టులలో చెరి 50 మంది చొప్పున మొత్తం 150 మంది స్విమ్మర్లను అందుబాటులోకి తెచ్చింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరో 84 మంది స్విమ్మర్లను విధుల్లో ఉంచింది. వీరికి అదనంగా 51 డీఆర్ ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా మిగతా శాఖలతో కలిసి హైడ్రా చర్యలు తీసుకుంటోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ సందర్భంగా వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande