
అమరావతి , 25 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు 23 ప్రత్యేక రంగాల క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. క్వాంటమ్ టెక్నాలజీ, హార్టికల్చర్, అరుదైన ఖనిజాలు, బయోమెడిసిన్, ఫార్మాస్యూటికల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు వంటి భిన్న రంగాలను ఈ క్లస్టర్ విధానంలో భాగంగా అభివృద్ధి జరుగుతుంది.
సాంప్రదాయ పారిశ్రామిక పెట్టుబడులతో పాటు భవిష్యత్ సాంకేతిక రంగాలను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడమే ఈ విధానంలోని ప్రధాన లక్ష్యం. ఒక నిర్దిష్ట ప్రాంతంలో సంబంధిత పరిశ్రమలు, నైపుణ్య కేంద్రాలు, పరిశోధనా సంస్థలు, సరఫరాదారులు, సేవా సంస్థలు ఒకే పర్యావరణ వ్యవస్థగా ఏర్పడితే పెట్టుబడిదారులకు మౌలిక సదుపాయాల పరంగా ప్రయోజనం కలగవచ్చు.
క్వాంటమ్ టెక్నాలజీ, ఏఐ, డేటా సెంటర్లు వంటి రంగాలు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు అవకాశం కలుగుతుంది.
ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడుల ప్రతిపాదనలను వాస్తవ ప్రాజెక్టులుగా మార్చేందుకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది. ముఖ్యమంత్రి సమీక్షలో అక్టోబర్ చివరి నాటికి 80 శాతం పెట్టుబడి ప్రతిపాదనలను తదుపరి దశకు తీసుకెళ్లాలని, వాటిలో 75 శాతం ప్రాజెక్టులను గ్రౌండింగ్ దిశగా తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించిచారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్