
హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.) శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. సాహితీ ఇన్ఫ్రా మనీలాండరింగ్ కేసులో ఈ- సమన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ నెల 27వ తేదీన ఆయన విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. రూ.2.1 కోట్ల లావాదేవీలపై ఆరా తీయనున్నారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా ఈడీ అధికారులు ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఫ్రీ లాంచ్ పేరుతో కొనుగోలుదారుల నుంచి నగదు వసూలు చేసినట్లు అరికెపూడి గాంధీపై ఆరోపణలు ఉన్నాయి. గతంలో రూ.161 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. మరో విడతలో రూ.12.6 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. ఇప్పటివరకు 56 బ్యాంక్ ఖాతాలను అధికారులు సీజ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్