గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణపయ్య
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపయ్య చేరుకున్నారు. హైదరాబాద్లోని ట్యాంక్బండ్ క్రేన్ నంబర్ - 4 దగ్గర పంచముఖ సంకట హర మహా గణపతిని నిమజ్జనం చేశారు.
Ganesh idol


హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.) : హైదరాబాద్లోని ట్యాంక్బండ్ క్రేన్ నంబర్ - 4 దగ్గర పంచముఖ సంకట హర మహా గణపతిని నిమజ్జనం చేశారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గంగమ్మ ఒడికి చేర్చారు.

లంబోదరుడిని చూడటానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్త జన సంద్రంగా ఆ ప్రాంతంమొత్తం మారింది. సెక్రటేరియట్ సౌత్ ఈస్ట్ మార్గంలో భక్తులు కిక్కిరిసి పోయారు.

కాగా, అప్పర్ ట్యాంక్ బండ్పై అత్యంత కోలాహలంగా వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాలు కొనసాగుతున్నాయి. 12 క్రేన్ల ద్వారా నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతోంది. భద్రతకోసం పోలీస్ కంట్రోల్ రూం ద్వారా 58 సీసీటీవీ కెమెరాలతో పోలీసులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తి అయ్యేలా అప్పర్ ట్యాంక్ బండ్పై భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రతి క్రేన్ వద్ద ఒక ఎస్ఐ, ఐదుగురు పోలీస్ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో రంగంలోకి 25 క్రైమ్ టీమ్స్, 10 షీ టీమ్స్ బృందాలు విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 479 విగ్రహాల నిమజ్జనం పూర్తి అయ్యాయని పోలీసులు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande