
హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)
గణేశ్ నిమజ్జనానికి టీజీఎస్ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్సాగర్ పరిసర ప్రాంతాలకు, అక్కడి నుంచి వివిధ గమ్యస్థానాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా సుమారు 700 ప్రత్యేక బస్సుల ను అందుబాటులోకి తెచ్చింది.
శోభాయాత్ర రద్దీ, ట్రాఫిక్ మళ్లింపులను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు 44 కీలక ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు, కంట్రోలర్లను రంగంలోకి దించింది.
ప్రయాణికుల రాకపోకలు, బస్సుల నిర్వహణను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు జోనల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడంతో పాటు, ఖైరతాబాద్, లక్షీకాపూల్, కోటి, బషీర్బాగ్, ఇందిరా పార్క్, ఆకాశవాణి ప్రాంతాల్లో ప్రత్యేక ఆర్టీసీ క్యాంపులను నెలకొల్పింది.ట్రాఫిక్ రద్దీ లేదా మార్గమధ్యంలో బస్సులు మొరాయిస్తే తక్షణమే మరమ్మతులు చేపట్టేందుకు పోలీస్ స్టేషన్లు, వ్యూహాత్మక కూడళ్ల వద్ద 113 మంది అదనపు డ్రైవర్లు, 87 మంది మెకానిక్లను సిద్ధంగా ఉంచారు.
అత్యవసర పరిస్థితుల్లో రంగంలోకి దిగేందుకు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇందిరా పార్క్, వీవీ విగ్రహం వద్ద ప్రత్యేక ఆర్టీసీ రిలీఫ్ వాహనాలను మోహరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు