'తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్' కు కాంగ్రెస్ మద్దతు
'తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్' కు కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్గౌడ్ స్పష్టం చేశారు.
Tpcc


హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.) అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో 'తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్' కు కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) గుర్తింపు సంఘం ఎన్నికల వేళ ఇది ఒక కీలక పరిణామం గా చెప్పవచ్చు. ఈ మేరకు పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులకు టీపిసిసి తరఫున సమాచారం అందించారు.

టీడబ్ల్యూయూ (TWU) యూనియన్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల (DCC), సిటీ (CCC) కాంగ్రెస్ అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

తమ తమ నియోజకవర్గాల పరిధిలోని ఆర్టీసీ డిపోలలో కాంగ్రెస్ అనుబంధ టీడబ్ల్యూయూ యూనియన్కు సంపూర్ణ సహకారాన్ని, సమన్వయాన్ని అందించాలని, ఇతర ఏ యూనియన్లను ప్రోత్సహించవద్దని తేల్చి చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande