
హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.
ఈ హత్య కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కోణంలో ఆరా తీస్తున్న ఈడీ అధికారులు, నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్ను హైదరాబాద్ ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో రెండో రోజు కూడా విచారిస్తున్నారు.
హత్యకు దారితీసిన పరిస్థితులతో పాటు, ఆ సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు కూపీలాగుతున్నారు. ఈ విచారణలో భాగంగా నిన్న ఒక్కరోజే సుమారు 9 గంటల పాటు సుదీర్ఘంగా సునీల్ యాదవ్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. పలు కీలక అంశాలు, అనుమానాస్పద లావాదేవీలపై ఆయనను ఆరా తీశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు