
హైదరాబాద్ , 26 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ సామాజిక చరిత్రలో కీలక స్థానాన్ని సంపాదించుకున్న చాకలి ఇలమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. భూమి, జీవనోపాధి, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటాన్ని సీఎం గుర్తుచేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ....తెలంగాణ చరిత్రలో చాకలి ఇలమ్మ పేరు భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసిందన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన జీవనోపాధి, భూమి హక్కు, సామాజిక గౌరవం కోసం ఎదురొడ్డి నిలిచిన వ్యక్తిగా తెలంగాణ ప్రజా చరిత్రలో గుర్తింపు పొందింది అన్నారు. ముఖ్యమంత్రి తన సందేశంలో ఆమె పోరాటాన్ని ప్రస్తావిస్తూ అణగారిన వర్గాల హక్కులు, జీవనోపాధి, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన కృషిని గుర్తుచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్